sharad pawar: శివసేనతో కలవబోమని స్పష్టం చేసిన శరద్ పవార్!

  • శరద్ పవార్ తో సంజయ్ రౌత్ భేటీ 
  • శివసేన, బీజేపీ కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేయాలి
  • మేము విపక్షంలో కూర్చుంటాం
నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ) అధినేత శరద్ పవార్ తో శివసేన సీనియర్ నేత సంజయ్ రౌత్ ఈ రోజు మరోసారి సమావేశమైన విషయం తెలిసిందే. వారి భేటీ ముగిసిన అనంతరం శరద్ పవార్ మీడియాతో మాట్లాడి తమ అభిప్రాయాన్ని స్పష్టం చేశారు. శివసేన, బీజేపీ కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేయాలని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ తో పాటు మా పార్టీ ఎన్సీపీ విపక్షంలో కూర్చుంటుందని తెలిపారు.

ఇది ప్రజలు ఇచ్చిన తీర్పని, దానికి కట్టుబడి ఉంటామని శరద్ పవార్ వ్యాఖ్యానించారు. శివసేనతో కలవబోమని అన్నారు. బీజేపీతో కలిసే ఆ పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేయాలని అన్నారు. త్వరలో జరగనున్న రాజ్యసభ సమావేశాలపై సంజయ్ రౌత్ తనతో చర్చించారని చెప్పుకొచ్చారు. అలాగే, ఈ రోజు రాష్ట్రంలో నెలకొన్న రాజకీయ పరిస్థితులపై కూడా చర్చించామని చెప్పారు.
sharad pawar
ncp
Congress
shiv sena

More Telugu News