Pawan Kalyan: ఎప్పుడు ఎవరికి తాళి కడతారో.. ఎప్పుడు ఎవర్ని ఎగతాళి చేస్తారో ఆయనకే తెలియదు: పవన్ పై వైసీపీ ఎమ్మెల్యే సుధాకర్ ఫైర్

  • ఎల్లో మీడియా వార్తలను పట్టుకుని తప్పుడు ప్రచారం చేస్తున్నారు
  • వైయస్ కుటుంబం అంటే పవన్ కు భయం
  • చంద్రబాబు విష కౌగిలి నుంచి పవన్ బయటపడాలి
వైసీపీకి వ్యతిరేకంగా ఎల్లో మీడియా రాసిన వార్తలను పట్టుకుని తప్పుడు ప్రచారం చేస్తున్నారంటూ జనసేన అధినేత పవన్ కల్యాణ్ పై వైసీపీ ఎమ్మెల్యే సుధాకర్ బాబు మండిపడ్డారు. సొంత పార్టీ బలోపేతంపై దృష్టి పెట్టకుండా... దత్త పుత్రుడిలా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. సొంత పుత్రుడు నారా లోకేశ్ పనికిరాడని భావించిన టీడీపీ అధినేత చంద్రబాబు... దత్తపుత్రుడు పవన్ తో రాజకీయాలు చేయిస్తున్నారని అన్నారు.

వైయస్ రాజశేఖరరెడ్డి కుటుంబం అంటే పవన్ కు చాలా భయమని... అందుకే అవాకులు, చెవాకులు పేలుతున్నారని సుధాకర్ బాబు వ్యాఖ్యానించారు. పవన్ కల్యాణ్ దీక్షలో టీడీపీ నేతలు ఎందుకు కూర్చున్నారని ప్రశ్నించారు. పవన్ ఎప్పుడు ఎవరికి తాళి కడతారో, ఎప్పుడు ఎవర్ని ఎగతాళి చేస్తారో ఆయనకే తెలియదని ఎద్దేవా చేశారు. చంద్రబాబు విష కౌగిలి నుంచి ఆయన బయటపడాలని సూచించారు.
Pawan Kalyan
Chandrababu
Telugudesam
Janasena
YSRCP

More Telugu News