Crime News: దారికాసి దోచేశారు...చాగలమర్రి-పాణ్యం రోడ్డులో దొంగల బీభత్సం

  • కొరియర్‌ కంపెనీ తరలిస్తున్న రూ.25 లక్షల విలువైన సెల్‌ఫోన్‌లు దోపిడీ
  • వాహనాలను ఆపి  సిబ్బందిని బెదిరించి బాక్స్‌లు స్వాధీనం
  • సెల్‌ఫోన్‌లు తీసుకుని బాక్స్‌లు పడేసిన వైనం
ఓ కొరియర్‌ కంపెనీ భారీ సంఖ్యలో సెల్‌ ఫోన్‌లను వాహనాల్లో తరలిస్తున్నారని గుర్తించిన దొంగలు దారికాసి వాటిని దోచేశారు. కర్నూలు జిల్లా చాగలమర్రి - పాణ్యం రోడ్డులో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ రోడ్డులో వస్తున్న వాహనాలను అడ్డగించిన దొంగలు వాహన సిబ్బందిని బెదిరించి సెల్‌ఫోన్‌లు ఉన్న కొరియర్ బాక్సులను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం సెల్‌ ఫోన్‌ను తమ వెంట తెచ్చుకున్న సంచుల్లో నింపుకుని అట్టపెట్టెలను అక్కడే పడేసి వెళ్లిపోయారు. దొంగలు దోచుకున్న సెల్‌ఫోన్‌ల విలువ దాదాపు రూ.25 లక్షల వరకు ఉంటుందని భావిస్తున్నారు.
Crime News
ronery
Kurnool District
chagalamarri-panyam road

More Telugu News