Uma maheshwari: విజయారెడ్డి హత్యోదంతం నేపథ్యంలో.. పత్తికొండ తహసీల్దార్ ఉమా మహేశ్వరి ముందు జాగ్రత్తలు!

  • విజయారెడ్డి హత్యతో రెవెన్యూ అధికారుల్లో ఆందోళన
  • ముందు జాగ్రత్త చర్యల్లో నిమగ్నం
  • తాడుకు ఆవల ఉండే అర్జీలు ఇవ్వాలన్న ఉమా మహేశ్వరి
తెలంగాణలోని అబ్దుల్లాపూర్ మెట్ తహసీల్దారు విజయారెడ్డి దారుణ హత్యతో రెవెన్యూ అధికారులు హడలిపోతున్నారు. తమ ప్రాణాలకు ఎక్కడ ముప్పు వస్తుందోనన్న భయాందోళనలు వారిలో కనిపిస్తున్నాయి. అదే భయంతో ఉన్న కర్నూలు జిల్లా పత్తికొండ తహసీల్దారు ఉమా మహేశ్వరి, ముందు జాగ్రత్త చర్యలు చేపట్టారు. తన చాంబర్ లో ఓ తాడును కట్టించారు. అర్జీలు ఇచ్చే వారు ఎవరైనా తాడుకు ఆవల ఉండి మాత్రమే వాటిని అందించాలన్న ఆదేశాలు జారీ చేశారు.  
Uma maheshwari
Pattikonda
Tahasildar
Rope

More Telugu News