Vijay Sethupathi: యాడ్ రేపిన చిచ్చు... నటుడు విజయ్ సేతుపతి ఇంటి ముట్టడి!

  • ఆన్ లైన్ వ్యాపార సంస్థకు విజయ్ ప్రచారం
  • చిరు వ్యాపారులకు నష్టమంటూ నిరసనలు
  • విజయ్ ఇంటి వద్ద పోలీసుల బందోబస్తు
ఆన్ లైన్ వ్యాపారం ఉత్తమమంటూ తమిళ నటుడు విజయ్ సేతుపతి నటించిన ఓ యాడ్, ఇప్పుడాయనకు చిక్కులు తెచ్చి పెట్టింది. చిరు వ్యాపారులకు పెను నష్టం కలిగించే, ఆన్ లైన్ వ్యాపారాన్ని విజయ్ సేతుపతి ప్రోత్సహించడాన్ని నిరసిస్తూ, ఆయన ఇంటిని వ్యాపారులు ముట్టడించారు. ఆయన ఇంటిని ముట్టడిస్తామని ఇప్పటికే ప్రకటించిన చిరు వ్యాపార సంఘాలు ఇంటి ముందు ఆందోళనకు దిగడంతో కొంత ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. విషయం తెలుసుకున్న పోలీసులు, విజయ్ సేతుపతి ఇంటి వద్ద బందోబస్తును పెంచారు. కాగా, విజయ్ 'మండి' ఆన్ లైన్ వ్యాపార ప్రకటనలో నటించగా, గత కొంతకాలంగా అది టీవీ చానెళ్లలో ప్రసారమవుతోంది.
Vijay Sethupathi
Online
Ad
Protest
Small Traders

More Telugu News