Airport: చెన్నైకి వచ్చిన విమానం టాయ్ లెట్ లో రూ. 2.24 కోట్ల విలువైన బంగారం!

  • దుబాయ్ నుంచి వచ్చిన విమానం
  • బంగారం తరలింపుపై ముందే సమాచారం
  • 5.6 కిలోల బంగారం స్వాధీనం
దుబాయ్ లో బయలుదేరి, చెన్నైలో ల్యాండ్ అయిన ఓ విమానం టాయిలెట్ లో కస్టమ్స్ అధికారులు 5.6 కిలోల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఈ విషయాన్ని కమిషనర్ ఆఫ్ కస్టమ్స్ కార్యాలయం ఓ ప్రకటనలో తెలిపింది. ఈ విమానంలో బంగారాన్ని అక్రమంగా తరలిస్తున్నట్టు తమకు ఫిర్యాదు అందిందని, ప్రయాణికులు ఎవరి వద్దా బంగారం లభించక పోవడంతో విమానంలో క్షుణ్ణంగా తనిఖీలు చేయగా, మరుగుదొడ్డిలో దాచిన బంగారం కంట బడిందని తెలిపారు. టేపుతో చుట్టి ఉంచిన నాలుగు బండిల్స్ కనిపించగా, వాటిని తెరచి చూస్తే, 48 బంగారం కడ్డీలు ఉన్నాయని, వీటి విలువ సుమారు రూ. 2.24 కోట్ల వరకూ ఉంటుందని అంచనా వేస్తున్నట్టు వెల్లడించారు.
Airport
Gold
Chennai
Customs

More Telugu News