Rakul: సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం  

  • మరో హిందీ సినిమాలో రకుల్
  • పారిస్ లో 'సామజ వర గమన'
  • బాలీవుడ్ నిర్మాతతో ప్రభాస్ ప్రాజక్ట్
   *  కథానాయిక రకుల్ ప్రీత్ సింగ్ కు దక్షిణాదిన అవకాశాలు తగ్గినప్పటికీ, బాలీవుడ్ లో మాత్రం బాగానే వస్తున్నాయి. ఈ క్రమంలో తాజాగా అర్జున్ కపూర్ సరసన ఓ చిత్రంలో నటించే ఛాన్స్ వచ్చింది. కాష్వి నాయర్ దర్శకత్వంలో నిఖిల్ అద్వాని నిర్మిస్తున్న ఈ చిత్రం షూటింగ్ ఇప్పటికే మొదలైంది.
*  అల్లు అర్జున్, త్రివిక్రమ్ కాంబినేషన్లో రూపొందుతున్న 'అల వైకుంఠపురములో' చిత్రం షూటింగ్ ప్రస్తుతం పారిస్ లో జరుగుతోంది. అక్కడి వివిధ లొకేషన్లలో అల్లు అర్జున్, పూజా హెగ్డే జంటపై ఇప్పటికే ఆడియో పరంగా పాప్యులర్ అయిన 'సామజ వర గమన' పాటను చిత్రీకరిస్తున్నారు.
*  ప్రస్తుతం 'జాన్' చిత్రంలో నటిస్తున్న ప్రభాస్ త్వరలో ఓ హిందీ చిత్రంలో కూడా నటించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రముఖ బాలీవుడ్ నిర్మాత కరణ్ జొహార్ ఈ చిత్రాన్ని ప్లాన్ చేస్తున్నాడు. ఈ ప్రాజక్టు గురించి చర్చించే నిమిత్తం ప్రభాస్ త్వరలో ముంబై వెళతాడని తెలుస్తోంది.  
Rakul
Arjun Kapoor
Allu Arjun
Pooja Hegde
Prabhas

More Telugu News