Vijayareddy: తహసీల్దార్ విజయారెడ్డి హత్యోదంతం నేపథ్యంలో... కలకలం రేపుతున్న ఆడియో టేప్!

  • స్థానికుల మధ్య జరిగిన సంభాషణ
  • మధ్యలో ఎమ్మెల్యే మంచిరెడ్డి ప్రస్తావన
  • పట్టాలిప్పించేందుకు రూ. 30 లక్షలు తీసుకున్నారని ఆరోపణ
అబ్దుల్లాపూర్ మెట్ తహసీల్దార్ విజయారెడ్డి దారుణ హత్య తరువాత, ఓ ఆడియో టేప్ వెలుగులోకి వచ్చి ఇప్పుడు తీవ్ర కలకలం రేపుతోంది. ఈ ఆడియో ఇద్దరు స్థానికుల మధ్య జరిగిన సంభాషణగా తెలుస్తుండగా, గౌరెల్లి భూముల వివాదంలో ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి కూడా ఉన్నారన్న ప్రస్తావన వచ్చింది.

స్థానిక ఎమ్మెల్యే రైతుల నుంచి రూ. 30 లక్షలు తీసుకున్నారని, అందులో విజయారెడ్డిని హత్య చేసిన సురేశ్ కు చెందిన రెండు, మూడు లక్షలు ఉంటాయని అనుకున్నారు. డబ్బులు నొక్కేసే అధికారులకు ఇలా కావాల్సిందేనని చెప్పుకున్నారు. ఈ ఆడియో టేప్ ఇప్పుడు తెగ వైరల్ అవుతోంది. కాగా, గౌరెల్లి భూముల విషయంలో తనకు ప్రమేయముందనడాన్ని మంచిరెడ్డి కిషన్ రెడ్డి ఖండించారు. సురేష్ ఎవరో తనకు తెలియదని స్పష్టం చేశారు.
Vijayareddy
Abdullahpurmet
Audio
Viral

More Telugu News