onions: మరింత పెరిగిపోయిన ఉల్లి ధరలు

  • దేశంలోని పలు ప్రాంతాల్లో కిలో ఉల్లి ధర రూ.100 
  • హైదరాబాద్‌లో కిలో ఉల్లి ధర రూ.50 -70 మధ్య  
  • ఉత్తరప్రదేశ్‌లో రూ.80కి పెరిగిన ధర
ఉల్లిపాయ ధరలు భారీగా పెరిగిపోయాయి. దేశంలోని పలు ప్రాంతాల్లో కిలో ఉల్లి ధర రూ.100గా ఉంది. ధరలు అమాంతం పెరగడంతో ఢిల్లీలో ఉల్లిపాయలను ప్రభుత్వ ఆధ్వర్యంలో విక్రయిస్తున్నారు. హైదరాబాద్‌లో కిలో ఉల్లి ధర రూ.50 -70 మధ్య అమ్ముతున్నారు. ఉత్తరప్రదేశ్‌లో వీటి ధర రూ.70 నుంచి 80 మధ్య ఉంది.

రెండు నెలల క్రితం కిలో ఉల్లి ధర రూ.80కి చేరిన విషయం తెలిసిందే. మహారాష్ట్రలో ఇటీవల కురిసిన భారీ వర్షాలతో ఉల్లి సాగు తగ్గిపోయింది. పెరిగిన ఉల్లి ధరలు సామాన్యుడికి కంటతడి పెట్టిస్తున్నాయి. మార్కెట్లో వీటి ధరలు ఆకాశానికి అంటుకునేలా పెరిగిపోతుండడంతో సామాన్యుడు వీటిని కొనకుండానే వెనుదిరుగుతున్నాడు.
onions
New Delhi
Hyderabad
Uttar Pradesh

More Telugu News