Rabi Pirzada: అల్లా నన్ను క్షమించాలి... వినోద రంగాన్ని వీడుతున్నా: గతంలో మోదీని బెదిరించిన పాక్ సింగర్ సంచలన ప్రకటన!

  • ఆన్ లైన్ లో రబీ పిర్జాదా ప్రైవేట్ చిత్రాలు
  • తీవ్ర విమర్శలు ఎదురుకావడంతో మనస్తాపం
  • ఇకపై తాను షో బిజ్ లో ఉండబోనని ప్రకటన
తన ఒంటికి బాంబులు పెట్టుకుని ఫోటోలకు పోజులిస్తూ, భారత ప్రధాని నరేంద్ర మోదీని హత్య చేస్తానని ప్రకటించిన పాకిస్థాన్ సింగర్ రబీ పిర్జాదా, మరో సంచలన ప్రకటన చేసింది. తన ప్రైవేటు చిత్రాలు ఆన్ లైన్ లో లీక్ కావడంతో మనస్తాపానికి గురైన ఆమె, వినోద రంగాన్ని వీడుతున్నట్టు ప్రకటించింది. "నేను రబీ పిర్జాదా... షో బిజ్ ను వదిలేస్తున్నాను. నా పాపాలను అల్లా క్షమించాలని ప్రార్థిస్తున్నాను. నాకు మద్దతుగా నిలిచిన అభిమానులకు కృతజ్ఞతలు" అని ఆమె తన ట్విట్టర్ ఖాతాలో వెల్లడించింది.

కాగా, గత వారంలో రబీ ఏకాంతంగా గడుపుతున్న ప్రైవేటు వీడియోలు, చిత్రాలు ఆన్ లైన్ లో లీక్ కాగా, ప్రజల నుంచి తీవ్ర విమర్శలు ఎదురయ్యాయి. ఆపై ఆమె ఫెడరల్ ఇన్వెస్టిగేషన్ ఏజన్సీకి కూడా ఫిర్యాదు చేసింది. తన చిత్రాలను దొంగిలించి, వాటిని సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ లో ఉంచారన్న ఆమె ఫిర్యాదు మేరకు పోలీసులు విచారణ ప్రారంభించారు.
Rabi Pirzada
Show Biz
Pakistan
Narendra Modi

More Telugu News