Kadapa: కడప ఎయిర్ పోర్ట్ విమానాల వేళల్లో మార్పు!

  • సర్వీసు వేళల్లో మార్పులు
  • సమయాలను సవరించిన ట్రూజెట్
  • వెల్లడించిన డైరెక్టర్ శివప్రసాద్
కడప విమానాశ్రయం నుంచి పలు ఇతర ప్రాంతాలకు నడిచే విమాన సర్వీసు వేళల్లో మార్పులు చేసినట్టు ట్రూజెట్ వెల్లడించింది. ఈ మేరకు ఎయిర్‌ పోర్టు డైరెక్టర్‌ శివప్రసాద్‌ మీడియాకు ఒక ప్రకటన విడుదల చేశారు. మధ్యాహ్నం 2.35 గంటలకు విజయవాడకు బయలుదేరే విమానం 3.35 గంటలకు చేరుకుంటుందని తెలిపారు.

ఇదే సమయంలో హైదరాబాద్ కు 4.30 గంటలకు బయలుదేరే సర్వీస్ 5.30 గంటలకు గమ్యాన్ని చేరుతుందని అన్నారు. చెన్నైకి 5.25 గంటలకు బయలుదేరే విమానం 6.25 గంటలకు చేరుతుందని అన్నారు. ఇక హైదరాబాద్ నుంచి మధ్యాహ్నం 3.05 గంటలకు, విజయవాడ నుంచి 4 గంటలకు, చెన్నై నుంచి 1.15 గంటలకు విమానాలు బయలుదేరి గంట వ్యవధిలో కడపకు చేరుతాయని తెలిపారు.
Kadapa
Airport
Services
Timings
Change

More Telugu News