'మమ్మీ ఎప్పుడొస్తుంది?'... అమాయకంగా అడుగుతున్న తహసీల్దార్ విజయారెడ్డి పిల్లలు!
- నిన్న తహసీల్దారు విజయారెడ్డి దారుణ హత్య
- అమ్మ ఎప్పుడు వస్తుందని అడుగుతున్న పిల్లలు
- నేడు విజయారెడ్డి అంత్యక్రియలు
నిన్న ఉదయం తన పిల్లలను స్వయంగా స్కూలుకు సిద్ధం చేసి వెళ్లిన విజయారెడ్డి, ఆపై మధ్యాహ్నం సజీవ దహనమైన సంగతి తెలిసిందే. చైత్ర, భువనసాయి సాయంత్రం స్కూలు నుంచి ఇంటికి వచ్చి, తల్లి కనిపించక, అమాయకంగా చూస్తూ, అమ్మెక్కడని ప్రశ్నిస్తుంటే, వారికి ఎవరూ సమాధానం చెప్పలేకపోతున్నారు.
కాగా, విజయారెడ్డి అంత్యక్రియలను మంగళవారం అత్తగారి స్వగ్రామమైన నల్లగొండ జిల్లా మునుగోడు మండలం కల్వలపల్లిలో నేడు నిర్వహించనున్నట్లు బంధువులు తెలిపారు.