మా అబ్బాయికి మతిస్థిమితం లేదు: తహసీల్దార్ హత్య కేసు నిందితుడి తండ్రి వెల్లడి
- అబ్దుల్లాపూర్ మెట్ తహసీల్దార్ దారుణ హత్య
- సజీవదహనం చేసిన సురేశ్ అనే యువకుడు
- సురేశ్ కు ఏమీ తెలియదంటున్న తల్లిదండ్రులు
కాగా, నిందితుడు సురేశ్ తండ్రి కృష్ణ మీడియాతో మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తన కొడుకు సురేశ్ కు మతిస్థిమితం లేదని అన్నారు. తమ భూమిపై వివాదం ఉండడంతో హైకోర్టులో కేసు నడుస్తోందని తెలిపారు. ఈ వివాదం గురించి సురేశ్ కు అసలు తెలియదని, అతను తహసీల్దార్ కార్యాలయానికి ఎందుకు వెళ్లాడో అర్థంకావడం లేదని పేర్కొన్నారు. అటు సురేశ్ తల్లి పద్మ మాట్లాడుతూ, ఎవరో కావాలని కుట్రపూరితంగా ఈ పని చేయించి ఉంటారని వ్యాఖ్యానించారు.