Chandrababu: సీఎస్ బదిలీ అగౌరవపరిచేలా ఉంది: చంద్రబాబు

  • సీఎస్ బదిలీపై చంద్రబాబు స్పందన
  • ఇలాంటి చర్యలను వ్యతిరేకించాలని పిలుపు
  • సీఎస్ ఎలా వ్యవహరించినా ఇలాంటి చర్యలు సరికాదని వ్యాఖ్యలు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యం బదిలీ వ్యవహారంపై టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు స్పందించారు. సీఎస్ బదిలీ ఆయనను అగౌరవపరిచేదిగా ఉందని అభిప్రాయపడ్డారు. సీఎస్ ఎలా వ్యవహరించినా ఇలాంటి చర్యలు తీసుకోవడం సరికాదని హితవు పలికారు. ఇలాంటి నిర్ణయాలతో వ్యవస్థలను నిర్వీర్యం చేయడాన్ని అందరూ వ్యతిరేకించాలని పిలుపునిచ్చారు. ఇవాళ ఆకస్మికంగా ఏపీ సీఎస్ ను బదిలీ చేసిన ఏపీ సర్కారు ఆయనను బాపట్లలోని మానవ వనరుల అభివృద్ధి కేంద్రానికి డీజీగా పంపింది.
Chandrababu
AP CS
YSRCP
Jagan
Andhra Pradesh

More Telugu News