YSRCP: పవన్‌ 'పింక్' రీమేక్ సినిమాలో నటిస్తున్నారు.. దీన్ని బట్టి జగన్‌ పాలన బాగుందని ఒప్పుకున్నట్లే!: మంత్రి అనిల్

  • జగన్‌  పాలన  బాగుంటే తిరిగి సినిమాలు చేసుకుంటానన్న పవన్
  • పవన్‌ కల్యాణ్ 'పింక్‌' రీమేక్‌ లో నటిస్తున్నారన్న అనిల్ 
  • పవన్‌ తీరు సరిగా లేదని విమర్శ
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్‌ అద్భుతమైన పాలన అందిస్తే తాను రాజకీయాలు వదిలేసి సినిమాలు చేసుకుంటానని నిన్న జనసేన అధినేత పవన్ కల్యాణ్ వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. దీనిపై మంత్రి అనిల్‌ కుమార్‌ యాదవ్‌ స్పందించారు. పవన్‌ కల్యాణ్ 'పింక్‌' అనే సినిమా రీమేక్‌ లో నటిస్తున్నారని వార్తలు వస్తున్నాయని ఆయన గుర్తు చేశారు. 'అంటే ఏపీలో జగన్‌ పాలన బాగుందని ఆయన ఒప్పుకున్నట్లే కదా?' అంటూ లాజిక్ తీశారు.

పవన్‌ తీరు సరిగా లేదని అనిల్ కుమార్ యాదవ్ విమర్శించారు. ఇసుకపై ప్రతిపక్ష పార్టీలు అనవసర రాద్ధాంతం చేస్తున్నాయని వ్యాఖ్యానించారు. ఆంధ్రప్రదేశ్ లో ఉన్న వాస్తవ పరిస్థితులు తెలుసుకొని ప్రతిపక్ష నేతలు మాట్లాడాలని ఆయన అన్నారు. కాగా, రాజకీయ నాయకులు నిజంగా ప్రజలపట్ల బాధ్యతగా ఉండుంటే, తాను కొత్తగా పార్టీ పెట్టాల్సిన అవసరమే ఉండేది కాదని కూడా నిన్న పవన్ కల్యాణ్ వ్యాఖ్యానించారు.
YSRCP
Telugudesam
Pawan Kalyan

More Telugu News