Mehbooba Mufti: త్వరలోనే బీజేపీ తరహా మత రాజకీయాలకు కాంగ్రెస్ తెరతీస్తుంది: మెహమూబా ముఫ్తీ ఫైర్

  • ఆర్టికల్ 370 రద్దుపై కాంగ్రెస్ వైఖరిని తప్పుబట్టిన ముఫ్తీ
  • జమ్మూకశ్మీర్ ప్రజలను మోసం చేయండంలో బీజేపీతో కాంగ్రెస్ పోటీ పడుతోంది
  • ట్విట్టర్ వేదికగా మండిపడ్డ ముఫ్తీ
కాంగ్రెస్ పార్టీపై జమ్మూకశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి, పీడీపీ అధినేత్రి మెహబూబా ముఫ్తీ మండిపడ్డారు. జమ్మూకశ్మీర్ కు ప్రత్యేక ప్రతిపత్తిని కల్పిస్తున్న ఆర్టికల్ 370 రద్దుపై కాంగ్రెస్ వైఖరిని ఆమె తప్పుబట్టారు. రాజ్యాంగ విరుద్ధంగా  ప్రవర్తిస్తూ, జమ్మూకశ్మీర్ ప్రజలను మోసం చేసే విషయంలో బీజేపీతో కాంగ్రెస్ పోటీ పడుతోందని విమర్శించారు. రానున్న రోజుల్లో కాంగ్రెస్ పార్టీ కూడా బీజేపీ మాదిరిగానే మత విద్వేష రాజకీయాలకు తెరతీస్తుందని ఆరోపించారు. ఈ మేరకు ఆమె ఈ ఉదయం ట్వీట్ చేశారు.
Mehbooba Mufti
Jammu And Kashmir
PDP
Congress
BJP

More Telugu News