Suryapet District: పల్టీ కొట్టిన పోలీసు వాహనం... తీవ్రంగా గాయపడ్డ ఎస్సై

  • సూర్యాపేట జిల్లాలో రోడ్డు ప్రమాదం
  • ప్రమాదంలో ఎస్సై లోకేశ్ తలకు తీవ్ర గాయాలు
  • హైదరాబాదులోని యశోద ఆసుపత్రికి తరలింపు
సూర్యాపేట జిల్లాలో సంభవించిన రోడ్డు ప్రమాదంలో ఎస్సై లోకేశ్ తీవ్రంగా గాయపడ్డారు. నాగారం, ఫణిగిరి మధ్య ఈ ప్రమాదం చోటు చేసుకుంది. గుమ్మడవెల్లలో కాంగ్రెస్, టీఆర్ఎస్ కార్యకర్తల మధ్య ఘర్షణ చోటు చేసుకున్న సందర్భంగా... అక్కడకు వెళ్లి వస్తున్న సమయంలో ఈ ప్రమాదం జరిగింది. ఆయన ప్రయాణిస్తున్న వాహనం పల్టీ కొట్టింది. ఈ ఘటనలో ఆయన తలకు తీవ్ర గాయాలయ్యాయి. దీంతో హుటాహుటిన ఆయనను సూర్యాపేట్ జనరల్ ఆసుపత్రికి తరలించి ప్రథమ చికిత్స అందించారు. అనంతరం మెరుగైన చికిత్స కోసం హైదరాబాదులోని యశోద ఆసుపత్రికి తరలించారు.
Suryapet District
Road Accident
SI Lokesh

More Telugu News