Telangana: జోగులాంబ గద్వాల జిల్లాలో దారుణం.. తొమ్మిదేళ్ల బాలికపై అత్యాచారం

షార్ట్స్‌లో చూడండి
తెలంగాణలోని జోగులాంబ గద్వాల జిల్లాలో దారుణం జరిగింది. మల్దకల్ మండలానికి చెందిన తొమ్మిదేళ్ల బాలికపై అదే గ్రామానికి చెందిన 25 ఏళ్ల యువకుడు నరేశ్ అత్యాచారానికి పాల్పడ్డాడు. శనివారం సాయంత్రం బాలికను చూసిన నరేశ్ ఆమెకు మాయమాటలు చెప్పి బైక్‌పై సమీపంలోని పొలానికి తీసుకెళ్లాడు. అక్కడ ఆ చిన్నారిపై అఘాయిత్యానికి పాల్పడి ఆపై ఇంటి వద్ద దిగబెట్టాడు.

ఆ రాత్రి బాలిక కడుపు నొప్పితో విలవిల్లాడుతుంటే గమనించిన అమ్మమ్మ ఆరా తీయగా అసలు విషయం బయటపడింది. దీంతో ఆదివారం ఆమె మనవరాలిని తీసుకుని పోలీస్ స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడు నరేశ్‌పై నిర్భయ, పోక్సో చట్టాల కింద కేసు నమోదు చేశారు. నిందితుడి కోసం గాలిస్తున్నారు. కాగా, బాలిక తల్లి ఇటీవల మృతి చెందగా, ఆమెను అమ్మమ్మ పెంచుతున్నట్టు పోలీసులు తెలిపారు.
Go Back to Shorts
Telangana
Jogulamba Gadwal District
girl
pocso act

More Telugu News