Telangana: గుండెపోటుతో మృతి చెందిన ఆర్టీసీ డ్రైవర్.. మృతదేహంతో డిపో వద్ద ధర్నా

  • గత అర్ధరాత్రి గుండెపోటుకు గురైన జైపాల్‌రెడ్డి
  • చికిత్స కోసం హైదరాబాద్ తరలిస్తుండగా మృతి
  • దేవరకొండ డిపో వద్ద ఉద్రిక్తత
తెలంగాణలో మరో ఆర్టీసీ డ్రైవర్ ప్రాణాలు కోల్పోయాడు. నల్గొండ జిల్లా దేరకొండ ఆర్టీసీ డిపోలో డ్రైవర్‌గా పనిచేస్తున్న జైపాల్‌రెడ్డి ఈ తెల్లవారుజామున గుండె పోటుతో ప్రాణాలొదిలాడు. స్వగ్రామం నాంపల్లి మండలంలోని లింగపల్లిలో ఆదివారం అర్ధరాత్రి అతడు గుండెపోటుతో కుప్పకూలాడు. వెంటనే జైపాల్‌రెడ్డిని దేవరకొండ ఆసుపత్రికి తరలించారు. మెరుగైన చికిత్స కోసం అక్కడి నుంచి హైదరాబాద్ తరలిస్తుండగా మార్గమధ్యంలోనే మృతి చెందాడు. దీంతో మృతదేహంతో దేవరకొండ బస్సు డిపో వద్దకు చేరుకున్న కుటుంబ సభ్యులు, ఆర్టీసీ కార్మికులు ధర్నాకు దిగారు. దీంతో డిపో వద్ద తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
Telangana
Nalgonda District
Devrakonda
RTC Driver

More Telugu News