Pawan Kalyan: పవన్ కల్యాణ్ పూర్తిగా చంద్రబాబు కంట్రోల్ లోకి వెళ్లిపోయాడు: మంత్రి అవంతి

షార్ట్స్‌లో చూడండి
ఏపీ మంత్రి అవంతి శ్రీనివాస్ రాష్ట్రంలో తాజా రాజకీయ పరిణామాలపై వ్యాఖ్యానించారు. టీడీపీ పాలనలో మహిళా ఎమ్మార్వోపై ఓ ఎమ్మెల్యే దాడిచేస్తే స్పందించని పవన్ ఇప్పుడు ఎందుకు రోడ్డెక్కుతున్నాడని ప్రశ్నించారు. ఎన్నికలకు ముందు చంద్రబాబు, పవన్ తెరవెనుక రాజకీయాలు నడిపి, ఇప్పుడు బహిరంగంగా రాజకీయాలు చేస్తున్నారని విమర్శించారు. పవన్ కల్యాణ్ ఇప్పుడు చంద్రబాబు ఉచ్చులో చిక్కుకున్నాడని, పూర్తిగా చంద్రబాబు నియంత్రణలోకి వెళ్లిపోయాడని వ్యాఖ్యానించారు. చంద్రబాబు కుమారుడు లోకేశ్ రాజకీయాలకు పనికిరానందున క్యాడర్ లేని పవన్ కల్యాణ్ నే టీడీపీ అధ్యక్షుడిగా చేయాలని వ్యంగ్యం ప్రదర్శించారు.
Go Back to Shorts
Pawan Kalyan
Chandrababu
Avanthi
Andhra Pradesh
YSRCP
Telugudesam
Jana Sena

More Telugu News