TSRTC: చేరిక మొదలయ్యింది...సమ్మె విరమించి విధుల్లో చేరిన్ టీఎస్ఆర్టీసీ ఉద్యోగి

షార్ట్స్‌లో చూడండి
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ టీఎస్‌ ఆర్టీసీ కార్మికులకు విధుల్లో చేరేందుకు విధించిన డెడ్‌లైన్‌కు ఓ ఉద్యోగి స్పందించాడు. ఉప్పల్‌ డిపోలో అసిస్టెంట్‌ డిపో మేనేజర్‌గా పనిచేస్తున్న కేశవ కృష్ణ (ఈ.నం. 201805) తాను తిరిగి విధుల్లో చేరుతున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు ఆయన డిపో మేనేజర్‌ను ఈరోజు కలిసి తన సమ్మతి పత్రాన్ని అందజేశారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన పిలుపు మేరకు తాను బేషరతుగా విధుల్లో చేరుతున్నట్లు కృష్ణ ప్రకటించారు.

కేసీఆర్‌ ప్రకటన నేపథ్యంలో కార్మికుల్లో అలజడి రేగే ప్రమాదం ఉందని భావించిన కార్మిక జేఏసీ దీనిపై ఎలా ముందుకు వెళ్లాలన్న దానిపై చర్చించేందుకు ఈరోజు అత్యవసరంగా సమావేశమై చర్చించారు. అనంతరం కార్మిక నాయకుడు అశ్వత్థామరెడ్డి సమ్మె కొనసాగుతుందని ప్రకటించిన విషయం తెలిసిందే.
Go Back to Shorts
TSRTC
KCR deadline
one employee dropped

More Telugu News