mamata banerjee: గుర్తు తెలియని నంబర్ల నుంచి మెసేజ్ లు వస్తున్నాయి.. నా ఫోన్ ట్యాప్ చేశారు: మమతా బెనర్జీ

  • ఈ విషయాన్ని చాలా తీవ్రంగా పరిగణించాలి 
  • దీనిపై చర్యలు తీసుకోవాలి 
  • కేంద్ర సర్కారు ఇప్పటికే చాలాసార్లు ట్యాప్ చేయించింది
  • ఇందుకు తగ్గ ఆధారాలున్నాయి 
గుర్తు తెలియని నంబర్ల నుంచి తనకు వాట్సాప్ మెసేజ్ లు వస్తున్నాయని, తన ఫోన్ ట్యాపింగ్ కు గురైందని పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ఆరోపించారు. ఈ విషయాన్ని చాలా తీవ్రంగా పరిగణించాల్సి ఉందని, దీనిపై చర్యలు తీసుకోవాలని ప్రధాని మోదీని తాను కోరుతున్నానని ఆమె అన్నారు. ఫోన్లు ట్యాపింగ్ కు గురవుతుంటే మాట్లాడే స్వేచ్ఛ ఎలా ఉంటుందని ఆమె ప్రశ్నించారు.

కనీసం ఫోనులో స్వేచ్ఛగా మాట్లాడే అవకాశం లేకపోతే దేశ ప్రజలకు స్వాతంత్ర్యం ఉన్నట్లేనా? అని మమతా బెనర్జీ నిలదీశారు. కేంద్ర సర్కారు ఇప్పటికే తన ఫోనును చాలాసార్లు ట్యాప్  చేయించిందని, ఇందుకు తగ్గ ఆధారాలు తన వద్ద ఉన్నాయని ఆమె చెప్పారు. మరో మూడు రాష్ట్రాలు కూడా తన ఫోనును ట్యాప్ చేయడానికి పని చేశాయని ఆరోపించారు. అయితే, ఆ రాష్ట్రాల పేర్లను తాను బయటకు వెల్లడించనని ఆమె చెప్పుకొచ్చారు.
mamata banerjee
West Bengal
whats app

More Telugu News