Crime News: పక్కన కూర్చుని నా కూతురిలా ఉన్నావన్నాడు...ఆ తర్వాత ఏం చేశాడో తెలుసా?

షార్ట్స్‌లో చూడండి
బస్సు ప్రయాణంలో పక్కసీటులో కూర్చున్న మహిళను ఉద్దేశించి ఆ వృద్ధుడు నా కూతురులా ఉన్నావన్నాడు. మాటలు కలిపి మధ్యలో మత్తుమందు ఇచ్చాడు. అనంతరం ఆమె డబ్బు, బంగారం చోరీ చేసి గుట్టు చప్పుడుకాకుండా దిగి వెళ్లిపోయాడు. వివరాల్లోకి వెళితే...కృష్ణా జిల్లా మొగల్రాజపురానికి చెందిన కంకారపు రమణాయమ్మ స్వస్థలం విశాఖపట్నం. పనిమీద ఇటీవల విశాఖపట్నం వచ్చిన ఆమె తిరిగి విజయవాడ వెళ్లేందుకు శుక్రవారం సాయంత్రం ఆర్టీసీ బస్సు ఎక్కారు. ఆమె పక్క సీటులో గుర్తు తెలియని ఓ వృద్ధుడు కూర్చున్నాడు. నువ్వు మా అమ్మాయిలా ఉన్నావంటూ మాటలు కలిపాడు.

అలా చాలాసేపు మాట్లాడుకున్నాక మధ్యలో బస్సును భోజనాల నిమిత్తం ఆపడంతో అతను కిందికి దిగాడు. తిరిగి శీతలపానీయంతో వచ్చి ‘నీరసంగా కనిపిస్తున్నావు...తాగమ్మా’ అంటూ బలవంతం పెట్టాడు. మరీ మొహమాటం పెట్టేస్తుండడంతో కాదనలేకపోయిన రమణాయమ్మ కూల్‌డ్రింక్‌ తీసుకుంది. తాగిన కాసేపటికి అందులో కలిపిన మత్తు పదార్థం వల్ల నిద్రలోకి జారుకుంది.

నిన్న ఉదయానికి బస్సు విజయవాడ చేరుకోగా నిద్రిస్తున్న ఆమెను డ్రైవర్‌ వచ్చి లేపాడు. మేలుకున్న ఆమె చూసుకోగా మెడలోని బంగారు చైను, పర్సులోని నగదు, రెండు సెల్‌ఫోన్లు కనిపించలేదు. పక్కన కూర్చున్న వృద్ధుడే కూల్‌డ్రింక్‌లో మత్తుమందు కలిపి ఇచ్చి ఈ చోరీకి ప్పాడ్డాడని భావించి ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది.
Go Back to Shorts
Crime News
bus journey
sleep tablets
theaft

More Telugu News