Telugudesam: ఉద్యోగాలు ఇప్పిస్తానని రూ.5 కోట్లు దండుకున్న టీడీపీ మాజీ మంత్రి మనవడు!

  • అమ్మ మ్యాన్‌పవర్‌ సెక్యూరిటీ సర్వీసెస్‌ పేరుతో సంస్థ
  • నిరుద్యోగుల నుంచి కోట్లాది రూపాయల వసూలు
  • బాధితుల ఫిర్యాదుతో మోసం వెలుగులోకి
విశాఖపట్టణం జిల్లా చోడవరానికి చెందిన టీడీపీ నేత, మాజీ మంత్రి రెడ్డి సత్యనారాయణ మనవడు రెడ్డి గౌతమ్‌‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఉద్యోగాల పేరుతో నిరుద్యోగుల నుంచి 5 కోట్ల రూపాయల వరకు వసూలు చేసినట్టు ఆయనపై ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో అతడిని అరెస్ట్ చేసినట్టు  విశాఖ నాలుగో పట్టణ సీఐ ఈశ్వరరావు తెలిపారు.

తన భార్య మధ్యప్రదేశ్ ఐఏఎస్ కేడర్ అధికారి అని, అవుట్ సోర్సింగ్ ఉద్యోగాలు ఇప్పిస్తానని గౌతమ్ ప్రచారం చేసుకున్నాడని పోలీసులు తెలిపారు. ఇందుకు అతడి భార్య లోచిని కూడా సహకరించినట్టు పేర్కొన్నారు. అమ్మ మ్యాన్‌పవర్‌ సెక్యూరిటీ సర్వీసెస్‌ ద్వారా నిరుద్యోగుల నుంచి కోట్లాది రూపాయలు వసూలు చేసిన గౌతం వారికి తప్పుడు నియామక పత్రాలు అందించాడు. బాధితుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.
Telugudesam
Andhra Pradesh
Reddy Gautham
arrest

More Telugu News