Balreddy: మానస బ్యారక్‌లో శశికుమార్.. గడ్డి తొలగింపు పనిని అప్పగించిన జైలు అధికారులు

  • యూటీ నంబరు 1084 నంబరు కేటాయింపు
  • వైద్య పరీక్ష అనంతరం పని అప్పగింత
  • నెల రోజులపాటు బెయిలు లభించే అవకాశం లేనట్టే
హయత్‌నగర్ కీర్తి కేసులో అరెస్ట్ అయిన ఆమె ప్రియుడు శశికుమార్‌ను అరెస్ట్ చేసిన పోలీసులు అతడిని చర్లపల్లి జైలుకు తరలించారు. జైలు అధికారులు అతడికి యూటీ నంబరు 1084ను కేటాయించారు. శశికుమార్‌ను మానస బ్యారక్‌లో ఉంచిన అధికారులు శనివారం ఉదయం వైద్య పరీక్షలు నిర్వహించారు. ఇతర లాంఛనాలు కూడా పూర్తి చేసిన తర్వాత రౌండ్స్ అనంతరం జైలు ఆవరణలో గడ్డి తొలగించే పనిని అతడికి అప్పజెప్పినట్టు జైలు అధికారులు తెలిపారు. శశికుమార్‌పై నమోదైన కేసు దృష్ట్యా అతడికి కనీసం నెల రోజులపాటు బెయిలు లభించే అవకాశం లేదని అధికారులు తెలిపారు.

మరోవైపు, శశికుమార్‌తోపాటు అరెస్ట్ అయిన కీర్తి మొదటి ప్రియుడు బాల్‌రెడ్డి ఎక్కడున్నాడన్న విషయం మాత్రం ఎవరికీ అంతుబట్టడం లేదు. అతడిని కూడా చర్లపల్లి జైలుకే పంపించామని పోలీసులు చెబుతున్నా.. అతడు తమ వద్ద లేడని జైలు అధికారులు చెబుతున్నారు. దీంతో బాల్‌రెడ్డి ఎక్కడున్నాడన్న విషయం చర్చనీయాంశంగా మారింది.
Balreddy
charlapally jail
keerthi
hayatnagar murder

More Telugu News