balreddy: హయత్‌నగర్ కీర్తి కేసు: కనిపించని మొదటి ప్రియుడు బాల్‌రెడ్డి.. పొంతనలేని అధికారుల సమాధానాలు!

  • చర్లపల్లికి జైలుకు తరలించినట్టు చెప్పిన పోలీసులు
  • తమ వద్ద లేడన్న జైలు అధికారులు
  • మిస్టరీగా మారిన బాల్‌రెడ్డి అదృశ్యం
తెలంగాణ వ్యాప్తంగా సంచలనమైన హయత్‌నగర్ కీర్తి కేసులో మొదటి ప్రియుడు బాల్‌రెడ్డి ఎక్కడున్నాడన్న విషయం ఇప్పుడు సర్వత్ర చర్చనీయాంశమైంది. కీర్తి ఇద్దరు ప్రియుళ్లు బాల్‌రెడ్డి, శశికుమార్‌లను అరెస్ట్ చేసిన పోలీసులు రిమాండ్‌కు తరలించారు. శుక్రవారం నిందితురాలు కీర్తిని చంచల్‌గూడ జైలుకు తరలించిన పోలీసులు శశికుమార్, బాల్‌రెడ్డిలను చర్లపల్లి జైలుకు తరలించినట్టు చెప్పారు.

అంతవరకు బాగానే ఉన్నా.. చర్లపల్లి జైలుకు ఒక్క శశికుమార్ మాత్రమే వచ్చాడని, బాల్‌రెడ్డి విషయం తమకు తెలియదని జైలు సిబ్బంది తెలిపారు. అతడిని చర్లపల్లి జైలుకు తీసుకొస్తున్నట్టుగానీ, తీసుకొస్తారని కానీ తమకు సమాచారం లేదని స్పష్టం చేశారు.

పోక్సో చట్టం కింద అరెస్ట్ అయిన బాల్‌రెడ్డి రిమాండులో భాగంగా చర్లపల్లి జైలుకు వెళ్లకపోవడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అతడిని చర్లపల్లికి తరలించినట్టు పోలీసులు చెబుతున్నా జైలులో లేడు. అలాగని చంచల్‌గూడ జైల్లోనూ లేడు. దీంతో బాల్‌రెడ్డి ఎక్కడున్నాడన్న ప్రశ్న మిస్టరీగా మారింది.  
balreddy
keerthi
hayatnagar
charlapally

More Telugu News