GO 2430: 2430 జీవో వివాదాన్ని సుమోటోగా స్వీకరించిన ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా... వైసీపీ సర్కారుకు నోటీసులు

  • 2430 జీవో తీసుకువచ్చిన వైసీపీ ప్రభుత్వం
  • దుర్మార్గపు జీవో అంటూ విపక్షాలు, మీడియా మండిపాటు
  • సీఎస్, సమాచార కమిషనర్ నుంచి వివరణ కోరిన ప్రెస్ కౌన్సిల్
ఏపీలో మీడియాను కట్టడి చేసే విధంగా ప్రభుత్వం జీవో నెంబర్ 2430 అమలుకు నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. దీనిపై మీడియా సంస్థలు, విపక్షాలు మండిపడుతున్నాయి. ఇది దుర్మార్గపు జీవో అని, దీన్ని తక్షణమే రద్దు చేయాలని ముక్తకంఠంతో నినదిస్తున్నాయి. తాజాగా, జీవో 2430 వివాదాన్ని ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా సుమోటోగా స్వీకరించింది. జీవోపై వివరణ ఇవ్వాలంటూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, సమాచార శాఖ ముఖ్య కమిషనర్ లకు నోటీసులు జారీ చేసింది. ఈ సందర్భంగా జీవో 2430పై ప్రెస్ కౌన్సిల్ వ్యాఖ్యానించింది. ఈ జీవో పాత్రికేయుల విధి నిర్వహణకు, మీడియా స్వేచ్ఛకు పెనుభారంగా ఉందని అభిప్రాయపడింది.
GO 2430
YSRCP
Andhra Pradesh
Jagan
Telugudesam

More Telugu News