Alapati Raja: ఆ జీవో రద్దయ్యే వరకు పోరాడుతూనే ఉంటాం: ఆలపాటి రాజా

  • వైసీపీ పాలనపై రాజా విమర్శలు
  • జగన్ నియంత అంటూ వ్యాఖ్యలు
  • ఏపీలో మీడియాపై ఆంక్షలు విధించారంటూ ఆగ్రహం
రాష్ట్రంలో ఎమర్జెన్సీని తలపించేలా వైసీపీ పాలన కొనసాగుతోందని టీడీపీ నేత ఆలపాటి రాజా ఆరోపించారు. జగన్ నియంతృత్వ ధోరణితో పాలన సాగిస్తున్నారని మండిపడ్డారు. తమను ఎవరూ ప్రశ్నించకూడదని జగన్ 2430 జీవో తీసుకువచ్చారని, దేశంలో ఎక్కడా లేని విధంగా ఏపీలో మీడియాపై ఆంక్షలు ఉన్నాయనడానికి ఈ జీవోనే నిదర్శనమని రాజా వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో 2430 జీవో రద్దు చేసే వరకు టీడీపీ పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు.
Alapati Raja
Telugudesam
Andhra Pradesh
YSRCP

More Telugu News