Amruta Fadnavis: ప్రభుత్వ ఏర్పాటుపై ఫడ్నవిస్ భార్య అమృత స్పందన

  • రాజకీయ నాయకులందరూ వివేకంతో వ్యవహరించాలి
  • సాధ్యమైనంత త్వరగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలి
  • సుస్థిర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు
మహారాష్ట్రలో ప్రభుత్వ ఏర్పాటు విషయంలో నెలకొన్న ప్రతిష్టంభనపై ఆపద్ధర్మ ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ భార్య అమృత స్పందించారు. రాజకీయ నాయకులందరూ వివేకంతో వ్యవహరించాలని ఆమె అన్నారు. సాధ్యమైనంత త్వరగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని చెప్పారు. సుస్థిర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు రాజకీయ నాయకులంతా విజ్ఞతతో వ్యవహరించాలని కోరారు. యాక్సిస్ బ్యాంకులో అమృత సీనియర్ ఉద్యోగిగా పని చేస్తున్నారు. ఈ నెల 7వ తేదీతో మహారాష్ట్రలో ప్రస్తుత శాసనసభ కాలపరిమితి ముగియబోతోంది. అప్పట్లోగా ప్రభుత్వం ఏర్పాటు కాకపోతే... రాష్ట్రపతి పాలన విధించే అవకాశం ఉంది.
Amruta Fadnavis
Devendra Fadnavis
Maharashtra

More Telugu News