పవన్ కల్యాణ్ అభిమానులకు పండగే.. సినిమా చేస్తున్నారంటూ గుడ్ న్యూస్ చెప్పిన తరణ్ ఆదర్శ్
- బోనీ కపూర్, దిల్ రాజు నిర్మాతలుగా 'పింక్' రీమేక్
- పవన్ కొత్త సినిమాపై అధికారిక ప్రకటన చేసిన తరణ్ ఆదర్శ్
- 'అజ్ఞాతవాసి' తర్వాత పవన్ నటించనున్న సినిమా ఇదే
'బిగ్ న్యూస్. తమిళంలో బాలీవుడ్ సినిమా 'పింక్'ను రీమేక్ చేసిన బోనీ కపూర్... ఇప్పుడు దిల్ రాజుతో చేతులు కలపారు. 'పింక్'ను తెలుగులో రీమేక్ చేస్తున్నారు. ఈ చిత్రంలో పవన్ కల్యాణ్ నటిస్తున్నారు. ఈ చిత్రానికి శ్రీరామ్ వేణు దర్శకత్వం వహించబోతున్నారు. 'అజ్ఞాతవాసి' తర్వాత పవన్ నటిస్తున్న సినిమా ఇదే' అంటూ తరణ్ ఆదర్శ్ ట్వీట్ చేశారు. తరణ్ చేసిన ట్వీట్ తో పవన్ అభిమానులు ఆనందంలో మునిగిపోయారు.