Siddipet District: ఆలస్యంగా వచ్చినందుకు.. తనకు తాను జరిమానా విధించుకున్న మంత్రి హరీశ్ రావు!

  • తనకు తాను రూ.50 లక్షల ఫైన్‌ వేసుకున్న అమాత్యుడు
  • సిద్ధిపేట జిల్లా దుబ్బాకలో కార్యక్రమం
  • ఆ నిధులతో మహిళా భవనాన్ని నిర్మిస్తానని హామీ
తెలంగాణ ఆర్థిక శాఖ మంత్రి హరీశ్‌రావుకు రూ.50 లక్షల జరిమానా పడింది. సిద్ధిపేట జిల్లా దుబ్బాకలో ఈరోజు ఉదయం జరిగిన మహిళా సంఘాల ప్రతినిధులకు చెత్తబుట్టల పంపిణీ కార్యక్రమానికి ఆయన ఆలస్యంగా రావడంతో ఈ జరిమానా విధించారు. అయితే ఈ పైన్‌ ఎవరో వేసింది కాదు. అమాత్యుల వారు తాను ఆలస్యంగా వచ్చినందుకు చింతిస్తూ తనకు తాను విధించుకున్నారు. ఈ రూ.50 లక్షల నిధులు త్వరలోనే విడుదల చేసి వీటితో ఆధునిక హంగులతో మహిళా భవనాన్ని నిర్మిస్తానని సభాముఖంగా తెలిపారు.  స్వచ్ఛ దుబ్బాకగా మార్చేందుకు మహిళా ప్రతినిధులు ముందుకు రావాలని కోరారు.
Siddipet District
dubbaka
Harish Rao
50 lakhs fine

More Telugu News