Jio: జియో ఫోన్ దీపావళి ఆఫర్ పొడిగింపు

  • రూ.1500 విలువైన ఫోన్ రూ.699కే..
  • మరో నెల రోజులపాటు ఈ ఆఫర్ అమల్లో ఉంటుందన్న జియో
  • 2జీ ఫోన్ వినియోగదారులు 4జీకి మారడానికి అవకాశం
ఆకర్షణీయమైన ఆఫర్లతో వినియోగదారులను ఆకట్టుకుంటున్న రిలయన్స్ జియో తక్కువ ధరకే  4జీ సేవలను అందించడానికి లాంచ్ చేసిన జియో ఫోన్ ధర తగ్గింపును మరో నెలరోజులు పొడిగించింది. రూ.1500 విలువచేసే జియో ఫోన్ ను ఇటీవల దీపావళి పండగ సందర్భంగా ‘జియో ఫోన్ దీపావళి 2019’ పేర రూ.699కే అందించింది. తాజాగా రిలయన్స్ ఈ ఆఫర్ ను మరో నెలరోజులు పొడిగించినట్లు ప్రకటించింది. 2జీ ఫోన్ వినియోగదారులు ఈ ఆఫర్ తో తమ ఖాతాదారులుగా మారతారని ఆశిస్తోంది. అంతేకాక, ఫీచర్ ఫోన్లు ఉపయోగించేవారు ఈ ఆఫర్ ను ఉపయోగించుకోవాలన్న ఉద్దేశంతో పొడిగించామని జియో వెల్లడించింది.
Jio
Phone
Offer

More Telugu News