Jagan: కష్టాల తర్వాత మంచిరోజులు కూడా వస్తాయని నిరూపించుకుందాం: సీఎం జగన్

  • విజయవాడలో రాష్ట్రావతరణ వేడుకలు
  • హాజరైన సీఎం జగన్
  • ఐదేళ్ల తర్వాత వేడుకలు జరుపుకోవడం పట్ల హర్షం
ఏపీ సీఎం జగన్ రాష్ట్రావతరణ వేడుకల్లో పాల్గొన్నారు. విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో నిర్వహించిన ఈ వేడుకల్లో ఆయన మాట్లాడుతూ, ఐదేళ్ల అనంతరం రాష్ట్రావతరణ వేడుకలు నిర్వహించుకోవడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. కష్టాల తర్వాత మంచి రోజులు కూడా వస్తాయని నిరూపించుకుందామని పిలుపునిచ్చారు. రాష్ట్ర పురోగతికి అందరూ సహకరించాలని విజ్ఞప్తి చేశారు. దశాబ్దకాలంగా రాష్ట్రం వెనుకబడిపోయిందని, రాష్ట్ర పునర్నిర్మాణంలో అందరూ భాగం కావాలని అన్నారు.

రాష్ట్రం కోసం పొట్టి శ్రీరాములు ప్రాణత్యాగం చేశారని, ఎందరో మహానుభావులు పోరాడారని తెలిపారు. దేశంలో మరే రాష్ట్రం ఇంతటి వంచనకు గురికాలేదని సీఎం జగన్ ఆవేదన వ్యక్తం చేశారు. ఇదే కార్యక్రమంలో రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ కూడా పాల్గొన్నారు. ఎంతో గొప్ప సంస్కృతి కలిగిన ఏపీకి గవర్నర్ ను కావడం తనకు దక్కిన భాగ్యమని తెలిపారు.
Jagan
Andhra Pradesh
Vijayawada
YSRCP

More Telugu News