Ambati Rambabu: విడిపోయినట్టుగా ఉన్నా కలిసే నడుస్తున్నారు: చంద్రబాబు, పవన్ లపై అంబటి రాంబాబు వ్యాఖ్యలు

  • చంద్రబాబు చెప్పిందే పవన్ చేస్తారని వ్యాఖ్యలు
  • విడిపోయినట్టు నటిస్తున్నారని విమర్శలు
  • జగన్ వంటి వ్యక్తి సాక్షులను ప్రభావితం చేస్తారనడం సరికాదన్న అంబటి
విపక్ష నేత చంద్రబాబు, జనసేనాని పవన్ కల్యాణ్ లపై వైసీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు ధ్వజమెత్తారు. చంద్రబాబు, పవన్ కల్యాణ్ విడిపోయినట్టుగా ఉన్నా కలిసే నడుస్తున్నారని ఆరోపించారు. చంద్రబాబు చెప్పిందే పవన్ చేస్తారని విమర్శించారు. వాస్తవానికి ఈ ఇద్దరూ విడిపోలేదని, విడిపోయినట్టు నటిస్తున్నారని అన్నారు. చంద్రబాబు పుత్రరత్నం లోకేశ్ దీక్ష చేపడితే, రాజకీయ దత్తపుత్రుడు పవన్ కల్యాణ్ లాంగ్ మార్చ్ చేస్తున్నారని వ్యంగ్యం ప్రదర్శించారు.

అంతేకాకుండా, సీబీఐ కోర్టులో సీఎం జగన్ పిటిషన్ కొట్టివేతకు గురవడంపైనా అంబటి స్పందించారు. జగన్ మీద కేసులున్నప్పుడే ప్రజలు ఎన్నికల్లో గెలిపించారని తెలిపారు. తనపై కేసులున్న సమయంలోనే పాదయాత్రకు వెళ్లారని, ఎన్నికల్లో పోటీచేశారని, ప్రజలే ఆయనను ఆశీర్వదించారని వివరించారు. జగన్ వంటి వ్యక్తి సాక్షులను ప్రభావితం చేస్తారనడం సరికాదని, అయినా తాము కోర్టు ఆదేశాలను గౌరవిస్తామని చెప్పారు.
Ambati Rambabu
Jagan
Chandrababu
Pawan Kalyan
CBI

More Telugu News