Maharashtra: సర్కారు ఏర్పాటుపై తొలగని ప్రతిష్టంభన... మహారాష్ట్రలో రాష్ట్రపతి పాలన తప్పదంటున్న బీజేపీ నేత

  • మహారాష్ట్రలో సీఎం పీఠం కోసం బీజేపీ, శివసేన కీచులాట
  • ఫలితాలు వెలువడి వారం గడుస్తున్నా ఏర్పాటు కాని ప్రభుత్వం
  • మళ్లీ చర్చలు జరుపుతామన్న సుధీర్ ముంగంటివార్
మహారాష్ట్రలో ఎన్నికల ఫలితాలు వెలువడి వారం రోజులైనా ఇప్పటికీ ప్రభుత్వం ఏర్పాటు కాలేదు. బీజేపీ, శివసేన మధ్య సీఎం పీఠం విషయంలో వివాదం తలెత్తడంతో సమస్య అపరిషృతంగా మిగిలిపోయింది. ఈ నేపథ్యంలో బీజేపీ నేత సుధీర్ ముంగంటివార్ (ఫడ్నవీస్ మంత్రివర్గంలో ఆర్థికమంత్రి) ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మహారాష్ట్రలో రాష్ట్రపతి పాలన వచ్చే అవకాశాలున్నాయని వ్యాఖ్యానించారు. నవంబరు 7లోగా సమస్య ఓ కొలిక్కి వస్తుందని భావిస్తున్నామని, అప్పటికీ సఖ్యత కుదరకపోతే రాష్ట్రపతి పాలన తప్పదని అన్నారు. అయితే, దీపావళి కారణంగా బీజేపీ, శివసేన మధ్య చర్చలు నిదానించాయని, మళ్లీ చర్చల ప్రక్రియను ముందుకు తీసుకెళతామని ముంగంటివార్ వెల్లడించారు.
Maharashtra
BJP
Shivsena
Sudhir Mungantiwar

More Telugu News