India: భారత జాతీయగీతం ఆలపిస్తుంటే కుర్చీలోంచి లేవని ఏంజెలా మెర్కెల్... అసలు కారణం వెల్లడించిన జర్మన్ ఎంబసీ

షార్ట్స్‌లో చూడండి
జర్మనీ చాన్సలర్ ఏంజెలా మెర్కెల్ భారత్ లో పర్యటిస్తున్న సంగతి తెలిసిందే. మెర్కెల్ గౌరవార్థం రాష్ట్రపతి భవన్ లో కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా భారత జాతీయగీతం ఆలపిస్తున్న సమయంలో ఏంజెలా మెర్కెల్ కుర్చీలోంచి లేవకపోవడం చర్చనీయాంశంగా మారింది. దీనిపై జర్మన్ ఎంబసీ వివరణ ఇచ్చింది. మెర్కెల్ కు మోకాళ్ల సమస్య ఉందని, ఆమె ఒక్కసారిగా లేచి నిలబడే పరిస్థితిలో లేరని జర్మన్ అధికారులు వెల్లడించారు. ఈ విషయాన్ని తాము భారత రాష్ట్రపతి భవన్ వర్గాలకు ముందుగానే తెలియజేశామని స్పష్టం చేశారు.
Go Back to Shorts
India
Germany
Narendra Modi
President Of India
Angela Merkel
Rashtrapathi Bhavan

More Telugu News