Avanthi: వాస్తవాలు మాట్లాడి గౌరవం నిలుపుకోండి: పవన్ కు హితవు పలికిన అవంతి
- సీఎం చిత్తశుద్ధిని ప్రశ్నించాల్సిన అవసరం పవన్ కు లేదన్న మంత్రి
- ఎన్నికల్లో ఓటమికి కారణాలు విశ్లేషించుకోవాలని సూచన
- చంద్రబాబుపై మోజు ఉంటే పార్టీని టీడీపీలో విలీనం చేయాలని సలహా
ఏపీ మంత్రి అవంతి శ్రీనివాసరావు జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ పై ధ్వజమెత్తారు. సీఎం జగన్ నిబద్ధతను ప్రశ్నించాల్సిన అవసరం పవన్ కు ఏంటని అవంతి నిలదీశారు. వాస్తవాలు మాట్లాడుతూ హుందాగా వ్యవహరించాలని, గౌరవం నిలుపుకోవాలని పవన్ కు హితవు పలికారు.
వైసీపీ నేతలపై విమర్శలు చేయకుండా, ఎన్నికల్లో జనసేన ఎందుకు ఓడిపోయిందో కారణాలు విశ్లేషించుకుంటే బాగుంటుందని సూచించారు. చంద్రబాబు మీద అంత ఇష్టం ఉంటే జనసేనను టీడీపీలో విలీనం చేయాలని సలహా ఇచ్చారు. విశాఖలో మీడియాతో మాట్లాడుతూ మంత్రి ఈ వ్యాఖ్యలు చేశారు.