Shivsena: సాహిబ్.. మీ అహంకారాన్ని మా వద్ద చూపించొద్దు: కలకలం రేపుతున్న శివసేన ఎంపీ ట్వీట్ 

  • ఉద్ధవ్ థాకరే ఒక్క మాట చెపితే శివసైనికుడే సీఎం అవుతాడు
  • అవసరమైనంత మంది ఎమ్మెల్యేలను పొందగలం
  • అలెగ్జాండర్ వంటి ఎంతో మంది కాలగర్భంలో కలిసిపోయారు
సీఎం పదవి అంశంలో బీజేపీ, శివసేనల మధ్య అగాధం మరింత పెరుగుతోంది. తాజాగా శివసేన ఎంపీ సంజయ్ రౌత్ చేసిన ట్వీట్ కలకలం రేపుతోంది. తమ అధినేత ఉద్ధవ్ థాకరే ఒక్క మాట చెబితే శివసైనికుడే ముఖ్యమంత్రి అవుతాడని ఆయన అన్నారు. కచ్చితంగా శివసేన నాయకుడే సీఎం అవుతారని... కావాలంటే రాసుకోవాలని చెప్పారు.

ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని శివసేన అనుకుంటే దానికి అవసరమైన ఎమ్మెల్యేలను పొందగలమని తెలిపారు. 50-50 ఫార్ములాతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని ప్రజలు తీర్పునిచ్చారని... శివసేన నుంచి ముఖ్యమంత్రి కావాలని వారు కోరుకుంటున్నారని చెప్పారు. 'సాహిబ్... మీ అహంకారాన్ని మా వద్ద చూపించకండి... అలెగ్జాండర్ వంటి ఎంతో మంది కాలగర్భంలో కలిసిపోయారు' అంటూ ట్వీట్ చేశారు.

Shivsena
Sanjay Raut
BJP

More Telugu News