Police: హైదరాబాద్ లో బార్ పై దాడికి ప్రయత్నించిన మహిళలు.. ఉద్రిక్తత

షార్ట్స్‌లో చూడండి
తమ కుటుంబాలను నాశనం చేస్తోన్న మద్యానికి వ్యతిరేకంగా హైదరాబాద్ లోని పార్శిగుట్టలో మహిళలు నిరసనకు దిగారు. పార్శిగుట్ట వద్ద మద్యం దుకాణం ఏర్పాటును వ్యతిరేకిస్తూ ఆందోళన చేశారు. ఓ బార్ ముందు వారు ధర్నా చేస్తుండడంతో దాని యజమాని మహిళలపై దాడికి పాల్పడ్డాడు.

దీంతో ఒక మహిళకు గాయాలయ్యాయి. ఈ పరిణామంతో  బార్ పై మహిళలు దాడికి ప్రయత్నించారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని పరిస్థితులను అదుపులోకి తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు. బార్ వద్ద పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. పార్శిగుట్టలో వైన్ దుకాణాలు ఉండకూడదని మహిళలు ఆందోళన కొనసాగిస్తున్నారు. మరోవైపు, కూకట్ పల్లిలోని భాగ్యనగర్ కాలనీలో మద్యం దుకాణం ఏర్పాటును వ్యతిరేకిస్తూ స్థానికులు ధర్నాకు దిగారు. ఈ ప్రాంతంలో మద్యం దుకాణానికి ఎందుకు అనుమతి ఇచ్చారంటూ అధికారులను నిలదీశారు.
Go Back to Shorts
Police
Hyderabad

More Telugu News