Vijayasai Reddy: ఇసుక కొరత పేరుతో 'ఇస్కో.. ఉస్కో' అనడమే పరువు తక్కువ పని: విజయసాయిరెడ్డి

  • నదులు, వాగులు పొంగి ఉండకపోతే దోసెడు ఇసుక కూడా దొరికేది కాదు
  • మరో ఐదేళ్లకు సరిపడా ఇసుకను చంద్రబాబు మాఫియా స్మగ్లింగ్ చేసింది
  • ప్రభుత్వం కూలిపోతుందని పిల్లి శాపాలు పెడుతున్నారు
టీడీపీ అధినేత చంద్రబాబుపై వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి మరోసారి ట్విట్టర్ వేదికగా విమర్శలు గుప్పించారు. ఇసుక కొరత పేరుతో 'ఇస్కో.. ఉస్కో' అనడమే పరువు తక్కువ పని అని... దానికి చంద్రబాబు మద్దతు ఇస్తారట అంటూ ఎద్దేవా చేశారు. పార్టనర్ ఖర్చుల కోసం ప్యాకేజీని సమకూర్చడం దగ్గర నుంచి పచ్చ మీడియాలో కవరేజి దాకా స్క్రీన్ ప్లే, దర్శకత్వం నిర్మాణం అన్నీ మీరే కాదా? అని ప్రశ్నించారు. మళ్లీ సపోర్ట్ స్టేట్ మెంట్ ఎందుకో అని అడిగారు. మీ గురించి ఎవరికి తెలియదనుకుంటున్నారని అన్నారు.

ఈ ఏడాది నదులు, వాగులు పొంగి ఉండకపోతే దోసెడు ఇసుక కూడా దొరికి ఉండేది కాదని విజయసాయిరెడ్డి చెప్పారు. మరో ఐదేళ్లకు సరిపడా ఇసుకను కూడా చంద్రబాబు మాఫియా స్మగ్లింగ్ చేసిందని ఆరోపించారు. హైదరాబాద్ సిటీలో ఎక్కడ చూసినా గోదావరి ఇసుకే కనిపించేదని అన్నారు. చేసిందంతా చేసి... వైసీపీ ప్రభుత్వం కూలిపోతుందని ఇప్పుడు పిల్లి శాపాలు పెడుతున్నారంటూ మండిపడ్డారు.
Vijayasai Reddy
Chandrababu
YSRCP
Telugudesam

More Telugu News