Narendra Modi: భారత్ కు రావడం చాలా సంతోషంగా ఉంది: జర్మనీ ఛాన్సలర్ ఏంజెలా మెర్కెల్‌

  • రాష్ట్రపతి భవన్ ను సందర్శించిన మెర్కెల్
  • గాంధీ మెమొరియల్‌ వద్ద బాపూజీకి నివాళి
  • భారత వైవిధ్య సంస్కృతిని గౌరవిస్తామని వ్యాఖ్య 
భారత్ లో రెండు రోజుల అధికార పర్యటనలో ఉన్న జర్మనీ ఛాన్సలర్ ఏంజెలా మెర్కెల్‌ ఈ రోజు ఉదయం రాష్ట్రపతి భవన్ ను సందర్శించారు. ఆమెకు రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్, ప్రధాని నరేంద్ర మోదీ స్వాగతం పలికారు. ఆమె త్రివిధ దళాల గౌరవ వందనం స్వీకరించారు. రాజ్‌ఘాట్‌లోని మహాత్మా గాంధీ మెమొరియల్‌ వద్ద బాపూజీకి నివాళులర్పించారు.

ఇక్కడకు రావడం చాలా సంతోషంగా ఉందని, ఇరు దేశాల మధ్య సత్సంబంధాలు ఉన్నాయని ఏంజెలా మెర్కెల్‌ తెలిపారు. ఇక్కడి వైవిధ్య సంస్కృతి, సంప్రదాయాలను తాము చాలా గౌరవిస్తామని వ్యాఖ్యానించారు. తన పర్యటనలో భాగంగా ఆమె మోదీతో భేటీ కానున్నారు. ఇరు దేశాల మధ్య 20 ఒప్పందాలపై సంతకాలు చేసే అవకాశం ఉంది. న్యూఢిల్లీలో జరిగే భారత్-జర్మనీ ఇంటర్ గవర్నమెంటల్ కన్సల్టేషన్ (ఐజీసీ)లోనూ ఆమె పాల్గొంటారు.
Narendra Modi
New Delhi

More Telugu News