జమ్మూకశ్మీర్ లో ఉగ్రవాదుల దుశ్చర్య.. బీజేపీ నేత వాహనానికి నిప్పు
- రెండు వాహనాలకు నిప్పు పెట్టిన ముష్కరులు
- ఇందులో ఒకటి బీజేపీ నేత వాహనం
- కుల్గాం జిల్లాలో ఈ తెల్లవారుజామున ఘటన
పోలీసుల కథనం ప్రకారం... బీజేపీ నేత ఆదిల్ అహ్మద్ నివాసం ఎదుట ఈ ఘటన చోటుచేసుకుంది. ఆదిల్ నివాసం బయట పార్క్ చేసిన వాహనాలకు ముష్కరులు నిప్పు పెట్టిన సమయంలో ఆయన ఇంట్లో లేరు. మరోవైపు, ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తును ప్రారంభించారు. జమ్మూకశ్మీర్ కేంద్రపాలిత ప్రాంతంగా అవతరించిన మరుసటి రోజే ఈ ఘటన చోటు చేసుకోవడం గమనించదగ్గ అంశం.