BCCI: సెలక్టర్లు టీ కప్పులు అందించారన్న ఆరోపణలపై స్పందించిన అనుష్క శర్మ

  • టీమిండియా సెలెక్టర్లపై ఫరూఖ్ ఇంజినీర్ ఆగ్రహం
  • అనుష్కకు టీ కప్పులు అందించారంటూ ఆరోపణలు
  • సంచలనం కోసం తన పేరు లాగొద్దంటూ తేల్చిచెప్పిన అనుష్క
బీసీసీఐ సెలెక్టర్లు విరాట్ కోహ్లీ భార్య అనుష్క శర్మకు టీ కప్పులు అందించారంటూ మాజీ క్రికెటర్ ఫరూఖ్ ఇంజినీర్ చేసిన వ్యాఖ్యలు క్రికెట్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. దీనిపై అనుష్క శర్మ ఘాటుగా స్పందించారు. "భారత క్రికెట్ సెలెక్షన్ కమిటీపై మీరు వ్యాఖ్యలు చేయదలుచుకుంటే చేసుకోండి. అంతే తప్ప మీ వాదనలకు సంచలనం జోడించేందుకు నా పేరును ప్రస్తావించవద్దు" అంటూ ఫరూఖ్ ఇంజినీర్ కు హితవు పలికారు.

"స్వార్థ ప్రయోజనాల కోసం  నా పేరును ఉపయోగించుకోవడాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ సహించబోను" అంటూ స్పష్టం చేశారు. "అయినా సెలెక్టర్లు నాకు టీ అందించారనడంలో వాస్తవం లేదు. వరల్డ్ కప్ లో నేను ప్రత్యక్షంగా చూసింది ఒక్క మ్యాచే. అది కూడా ఫ్యామిలీ బాక్స్ లో కూర్చుని చూశాను" అంటూ వివరణ ఇచ్చారు.
BCCI
Virat Kohli
Anushka Sharma

More Telugu News