Gitanjali: మహాప్రస్థానంలో ముగిసిన నటి గీతాంజలి అంత్యక్రియలు

  • గుండెపోటుతో మరణించిన నటి గీతాంజలి
  • ఫిలించాంబర్ వద్ద నివాళులు అర్పించిన అభిమానులు
  • కడసారి చూపులకు విచ్చేసిన సినీ ప్రముఖులు
సీనియర్ నటి గీతాంజలి గుండెపోటుతో మరణించిన సంగతి తెలిసిందే. ఆమె మరణవార్తతో చిత్ర పరిశ్రమలో విచారం అలముకుంది. గీతాంజలి అంత్యక్రియలు ఈ సాయంత్రం హైదరాబాద్ లోని జూబ్లీహిల్స్ మహాప్రస్థానం శ్మశానవాటికలో నిర్వహించారు.

అంతకుముందు, నంది నగర్ లోని ఆమె నివాసం నుంచి ఫిల్మ్ చాంబర్ వద్దకు భౌతికకాయాన్ని తీసుకువచ్చారు. ఫిలించాంబర్ వద్ద ఆమెకు నివాళులు అర్పించిన వారిలో సీనియర్ నటీమణులు అన్నపూర్ణ, కవిత, ప్రభ, రమాప్రభ తదితరులు ఉన్నారు. జీవితా రాజశేఖర్, శివాజీరాజా, పరుచూరి గోపాలకృష్ణ, బాబూ మోహన్ కూడా గీతాంజలి కడసారి చూపులకు వచ్చారు.
Gitanjali
Tollywood
Hyderabad

More Telugu News