Vijay Sai Reddy: అందుకే ప్యాకేజీ స్టార్ ను మళ్లీ తీసుకువచ్చారు: చంద్రబాబుపై విజయసాయిరెడ్డి విమర్శలు

షార్ట్స్‌లో చూడండి
వైసీపీ అగ్రనేత విజయసాయిరెడ్డి విశాఖపట్నంలో మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన చెబుతూ, టీడీపీ అధినేత చంద్రబాబుకు పవన్ దత్తపుత్రుడనే విషయం అందరికీ తెలుసని అన్నారు. చంద్రబాబుకు పవన్ ఇచ్చిన కాల్షీట్లు ఇంకా అయిపోలేదని వ్యంగ్యం ప్రదర్శించారు. రాష్ట్రంలో టీడీపీకి భవిష్యత్తు లేదని చంద్రబాబుకు అర్థమైందని, అందుకే ప్యాకేజీ స్టార్ ను మళ్లీ తెరపైకి తీసుకువచ్చారని ఆరోపించారు. టీడీపీ పని ఇక ఖాళీ అని తెలుసుకున్న ఎమ్మెల్యేలు తలో దిక్కుకు వెళుతుంటే చంద్రబాబుకు దిక్కుతోచడం లేదని, ప్యాకేజీ స్టార్ ను రంగంలో దింపడం వెనుక మతలబు అదేనని ఎద్దేవా చేశారు.
Go Back to Shorts
Vijay Sai Reddy
Chandrababu
Telugudesam
YSRCP
Pawan Kalyan
Jana Sena

More Telugu News