Pawan Kalyan: బాబాయ్ ఫొటోలతో చాలా స్ఫూర్తి పొందా: రామ్ చరణ్

షార్ట్స్‌లో చూడండి
తన ఫాంహౌస్ లోని గోవులతో జనసేన అధినేత పవన్ కల్యాణ్ సరదాగా గడిపిన ఫొటోలను సోషల్ మీడియాలో ఆ పార్టీ విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. వాటిపై హీరో రామ్ చరణ్ స్పందించాడు. బాబాయ్ ఫొటోలను చూసి తాను చాలా స్ఫూర్తిని పొందానని చెప్పాడు. త్వరలోనే తాను కూడా గోశాలను ప్రారంభించాలనుకుంటున్నానని తెలిపాడు. కాగా, ప్రస్తుతం రాజమౌళి తెరకెక్కిస్తున్న 'ఆర్ ఆర్ ఆర్' చిత్రంలో రామ్ చరణ్ నటిస్తున్నాడు. ఈ సినిమాలో అల్లూరి సీతారామరాజుగా చరణ్ కనిపించనున్నాడు. చరణ్ సరసన బాలీవుడ్ నటి అలియాభట్ నటిస్తోంది.
Go Back to Shorts
Pawan Kalyan
Ramcharan
Tollywood
Janasena

More Telugu News