Vijay Devarakonda: 'హీరో' విషయంలో డౌట్ అవసరం లేదంటున్న విజయ్ దేవరకొండ

షార్ట్స్‌లో చూడండి
విజయ్ దేవరకొండ నిర్మాతగా వ్యవహరించిన 'మీకు మాత్రమే చెప్తాను' రేపే విడుదల కానుంది. ఈ నేపథ్యంలో ఈ సినిమా ప్రమోషన్స్ లో ఆయన బిజీగా వున్నాడు. తాజా ఇంటర్వ్యూలో ఆయన ఈ సినిమాను గురించి మాట్లాడుతుండగా, 'హీరో' సినిమాను గురించిన ప్రశ్న ఎదురైంది.

విజయ్ దేవరకొండ హీరోగా ఆనంద్ అన్నామలై అనే తమిళ దర్శకుడితో కొంతకాలం క్రితం 'హీరో' సినిమా సెట్స్ పైకి వెళ్లింది. ఒక షెడ్యూల్ ను పూర్తి చేసి చాలా రోజులైంది .. రెండవ షెడ్యూల్ ఊసు లేకపోవడంతో ప్రాజెక్టు ఆగిపోయిందనే ప్రచారం జరుగుతోంది. ఈ విషయంపై విజయ్ దేవరకొండ స్పందిస్తూ .. 'హీరో' సినిమా ఆగిపోలేదు .. ఈ విషయంలో ఎలాంటి డౌట్ అవసరం లేదు. ప్రస్తుతం రెండవ షెడ్యూల్ ను ప్లాన్ చేస్తున్నారు. పూరి జగన్నాథ్ గారితో చేసే ప్రాజెక్టు తరువాతనే 'హీరో' పూర్తవుతుంది" అని చెప్పుకొచ్చాడు.
Go Back to Shorts
Vijay Devarakonda

More Telugu News