బీజేపీ అడుగులు అటువైపే.. ఆ పార్టీని నమ్మొద్దు: బీజేపీ మిత్రపక్షాలకు అశోక్ గెహ్లాట్ హెచ్చరిక
- ఏక పార్టీ పాలన దిశగా బీజేపీ అడుగులు వేస్తోంది
- చైనా తరహా పాలన కోసం యత్నిస్తోంది
- బీజేపీకి ప్రజాస్వామ్యంపై గౌరవం లేదు
బీజేపీకి ప్రజాస్వామ్యంపై గౌరవం లేదని ఆయన విమర్శించారు. చైనాలో ఉన్న విధంగా ఏక పార్టీ పాలన దిశగా వేగంగా అడుగులు వేస్తోందని చెప్పారు. ఈ విషయాన్ని బీజేపీకి మద్దతిస్తున్న ప్రతి పార్టీ గ్రహించాలని హితవు పలికారు. గతంలో పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కూడా ఇదే తరహా వ్యాఖ్యలు చేశారు. దేశంలో అధ్యక్ష తరహా పాలన దిశగా బీజేపీ అడుగులు వేస్తోందని ఆమె మండిపడ్డారు.