Pakistan: పాకిస్థాన్‌ రైలులో అగ్ని ప్రమాదం.. 16 మంది సజీవ దహనం

  • తేజ్‌గావ్ ఎక్స్‌ప్రెస్‌లో సిలిండర్ పేలుడు
  • కాలిబూడిదైన బోగీలు
  • మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం
పాకిస్థాన్‌లో ఈ ఉదయం రైలులో జరిగిన ఘోర అగ్ని ప్రమాదంలో 16 మంది సజీవ దహనమయ్యారు. మరో 13 మంది తీవ్రంగా గాయపడ్డారు. లాహోర్ నుంచి కరాచీ వెళ్తున్న తేజ్‌గావ్ ఎక్స్‌ప్రెస్‌లో ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. రహీమ్ యార్‌ఖాన్ సమీపంలోని లియాఖత్‌పూర్ వద్ద రైలులోని గ్యాస్ సిలిండర్ పేలి ఒక్కసారిగా మంటలు అంటుకున్నాయి.

సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని రైలులో చిక్కుకున్న వారిని రక్షించారు. క్షతగాత్రులను ఆసుపత్రులకు తరలించారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. అంటుకున్న మంటలను నియంత్రించేందుకు అగ్నిమాపక సిబ్బంది తీవ్రంగా శ్రమిస్తున్నారు. మంటలు ఇతర బోగీలకు వ్యాపించకుండా జాగ్రత్తలు తీసుకున్నారు.
Pakistan
rail accident
Rahim Yar Khan

More Telugu News