Pakistan: నవంబరు 9న కర్తార్‌పూర్ కారిడార్ ప్రారంభం.. సిద్ధూకు అందిన ఆహ్వానం

  • వచ్చే నెల 9న ప్రారంభించనున్న ఇమ్రాన్
  • ఆహ్వానంపై స్పందించని సిద్ధూ
  • తొలి జాబితాలో మన్మోహన్‌సింగ్, అమరీందర్ సింగ్
పాకిస్థాన్‌లోని కర్తార్‌పూర్ కారిడార్ ప్రారంభానికి అంతా సిద్ధమైంది. వచ్చే నెల 9న ప్రధాని ఇమ్రాన్‌ఖాన్ ఈ కారిడార్‌ను ప్రారంభించనున్నారు. ఈ వేడుకకు కాంగ్రెస్ నేత, ఇమ్రాన్ స్నేహితుడు అయిన నవజోత్ సింగ్ సిద్ధూకు ఆహ్వానం అందింది. అయితే, గతంలో ఇమ్రాన్ ప్రమాణ స్వీకారానికి వెళ్లి విమర్శల పాలైన సిద్ధూ తాజా ఆహ్వానంపై ఎలా స్పందిస్తాడనేది ఆసక్తికరంగా మారింది.

మరోవైపు, కర్తార్‌పూర్ గురుద్వారాను సందర్శించుకోనున్న 575 మంది భారత యాత్రికుల జాబితాను భారత ప్రభుత్వం పాకిస్థాన్‌కు నిన్ననే అందజేసింది. ఈ జాబితాలో మాజీ ప్రధాని మన్మోహన్‌సింగ్, పంజాబ్ సీఎం అమరీందర్ సింగ్, కేంద్రమంత్రి హరిసిమ్రత్ కౌర్, పంజాబ్ ఎంపీలు, ఎమ్మెల్యేలు ఉన్నారు.
Pakistan
kartarpur corridor
navjot singh sidhu
Imran khan

More Telugu News